| Daily భారత్
Logo




కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

News

Posted on 2025-02-07 09:33:03

Share: Share


కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో సిరిసిల్లలోని బి.వై. నగర్ నందు పవర్ లూమ్ కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మనోవికాస సదస్సును ఈరోజు నిర్వహించినారు.

ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నం చందర్ మాటాడుతూ ఆరోగ్య పరిరక్షణకు కార్మికులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలుపుతూ దురలవాట్లకు కార్మికులు దూరంగా ఉండాలని కోరారు.

మద్యపాన వ్యసనం శారీరక మానసిక రుగ్మతలకు కారణమై వ్యక్తి సామాజికంగా, ఆర్థికంగా పతనానికి దారితీస్తుందని తెలిపారు.

తంబాకు నమలడం, సిగరెట్ త్రాగడం, అతిగా టీలు త్రాగడం వల్ల క్యాన్సర్ లు, గ్యాస్ట్రిక్ సమస్యలుగా ఎక్కువగా వస్తున్నాయని అన్నారు.

దురలవాట్ల నుండి దూరం కావాలనుకున్నవారు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ లో సంప్రదించాలని కార్మికులకు సూచించారు.

దురలవాట్లను తగ్గించుకునే విధానాలను గురించి కార్మికులకు మెళకువలు నేర్పించారు.

జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కొనే విధానాలను గురించి వివరిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు.

నిద్ర సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు వస్తే నిర్లక్ష్యం చేయొద్దని వెంటనే కౌన్సిలింగ్ తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పారిశ్రామికుడు హన్మండ్ల రామనారాయణ, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత మరియు కార్మికులు పాల్గొన్నారు.

Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >