| Daily భారత్
Logo




సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2025-02-07 09:17:59

Share: Share


సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలంలోని నాగుల పల్లి గ్రామంలో ఎస్సీ వర్గీకరణ,బిసి కుల గణన అసెంబ్లీ లో ఆమోదం పొందిన సందర్భంగా నిర్వహించిన సంబరాలలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. అనంతరం షాద్ నగర్ నుండి ఈదులపల్లి వరకు బి.టి రోడ్డు వయా నాగులపల్లి  - 4.00 KM  (1.70 కోట్లు, నాగులపల్లి నుండి రాసమళ్ళ గూడ వరకు బీ.టీ రోడ్డు - 1.00 కి. మి (60 లక్షలు)

పనులకు,గ్రామంలో ఎస్సీ SDF 7.0 లక్షల నిధులతో ఎస్సీ కాలనీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 4 వ తేదీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని ఒక సువర్ణ దినంగా మారింది అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్,ఉత్తమ్ కుమార్ రెడ్డి,మల్లు రవి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించిన అనంతరం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు అని తెలిపారు.గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి ఫలితాలను కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకున్నారని మండిపడ్డారు. లిమ్కా బుక్ రికార్డ్ కోసం నివేదికలు పంపిన గత పాలకులు ప్రజల్లో ఎందుకు పెట్టలేదని,చట్ట బద్ధత ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీసీ ల సంఖ్య తగ్గిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కంటే ఓసీల సంఖ్య పెద్దగా మార్పు లేదన్నారు. బి ఆర్ ఎఎస్ హయాంలో 20% శాతం చూపించిన ఓసీ ల లెక్కలు 15% ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల రాజకీయ ఉనికి దెబ్బ తింటుందని కొందరు మూర్ఖులు తమ అభద్రత భావాన్ని చెప్పలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా కులాలకు అతీతంగా,రాజకీయాలకు అతీతంగా సామాజిక న్యాయంతో ముందుకు సాగుతుందని తెలిపారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ సైనికులు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బాలరాజు గౌడ్, కొండూర్గ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, నాయకులు రఘు నాయక్, ఇబ్రహీం, అరుంధతి, రాజు, రాములు గౌడ్,యాదయ్య, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >