Posted on 2025-02-05 04:44:55
అభాగ్యులు, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు, సేవలు అందిస్తున్న జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గండికోట
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గత కొన్ని నెలలుగా కాళ్లకు ఇన్ఫెక్షన్ అయి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఫుట్ పాత్ మీద జీవనం సాగిస్తున్న వృద్ధుడు బాబూరావు.
అతని దుర్భర జీవితాన్ని, కాళ్లకు ఇన్ఫెక్షన్ అయి అతను పడుతున్న బాధను గమనించిన జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గత నెలలో ఉచిత వైద్య సేవలు అందేలా సహకరించి,తన స్వంత డబ్బుతో రెండు నెలలకు సరిపడా ఖరీదైన మందులు ఇప్పించాడు .
అయిన వాళ్లే పట్టించుకోని పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసి పలకరిస్తే ఎక్కడ సహాయం అడుగుతారేమోనని పరిచయం ఉన్న వాళ్ళు పక్కకి తప్పుకొని వెళ్తున్న నేటి రోజుల్లో, తనకేమీ కానటువంటి ,తనకు సంబంధం లేని నిర్భాగ్యుల పట్ల కిరణ్ కుమార్ ఔదార్యాన్ని చూపిస్తున్నాడు.
చలికి వణుకుతూ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అనాథలకు దుప్పట్లను స్వెటర్లను పంపిణీ చేసి నిర్భాగ్యుల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
కాళ్లకు ఇన్ఫెక్షన్ అయిన బాబూరావును కిరణ్ స్వయంగా ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి దగ్గరుండి తాను కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడంలో సహాయ పడ్డారు.
మానవసేవే మాధవసేవ అని పెద్దలు చెప్పిన మంచి మాటే స్ఫూర్తిగా కిరణ్ కుమార్ సేవలు నిలుస్తాయి.
వయస్సులో చిన్న వాడే అయినా కిరణ్ ఆలోచనలు, పనులు గొప్పవి అనడంలో అతిశయోక్తి లేదు.
ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవాలని కిరణ్ కోరుతున్నారు.
కిరణ్ కుమార్ సేవలను పలువురు అభినందిస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >