| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

వివిధ అంశాలపై సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం.

డైలీ భారత్ న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి, నీటి పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్స్, తడి, పొడి చెత్త సేకరణ, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, సిబ్బంది, వాహనాల అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇప్పటిదాకా ఇంటి, నీటి పన్ను వసూలుపై ఆరా తీశారు. అధికారులు, సిబ్బందితో ఒక ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ, ఎన్ని ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నాయి? సెగ్రిగేషన్ చేసే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రారంభించిన రోడ్లు, మురుగుకాలువలు, జంక్షన్ల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో షేటర్లు వివరాలపై ఆరా తీశారు. ట్రేడ్ లైసెన్స్, మెప్మా పరిధిలో మహిళా సంఘాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, డీటీసీపీఓ అన్సార్, డీఈలు, టీపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Previous తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
Next సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్
ADVERTISEMENT