| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జనంసాక్షి తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన బర్క కృష్ణ యాదవ్

జనంసాక్షి  తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన బర్క కృష్ణ యాదవ్


ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే పత్రిక జనంసాక్షి

బిసి సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే పత్రిక జనంసాక్షి తెలుగు దినపత్రిక అని బిసి సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ అన్నారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బొడంపహాడ్ గ్రామంలో ఆయన జనంసాక్షి దినపత్రిక నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బర్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ జనంసాక్షి పత్రిక అన్ని రంగాల్లో ముందుండి ప్రజల సమస్యలను వెలికి తీయడంతో పాటు రాజకీయ పార్టీల సర్వేలలో నిజానిజాలు బయట పెట్టేది జనంసాక్షి పత్రికనే అని అన్నారు. 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల సర్వేలో జనంసాక్షి చేసిన సర్వే ఆదారంగానే ఫలితాలు వచ్చాయని అన్నారు.రాబోయే రోజుల్లో జనంసాక్షి దినపత్రికకు మరింత పేరు ప్రఖ్యాతలు దక్కుతాయని అన్నారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి ఏ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టులు ముందు ఉంటారని అన్నారు.అలాగే అవినీతి అక్రమాలపై కథనాలను, నిజాలను నిర్భయంగా రాస్తూ అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తరని, పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభమని అని వర్ణించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ కోట చంద్రశేఖర్, బిసి నాయకులు రమేష్ యాదవ్,కావలి రవి యాదవ్, ప్రవీణ్ యాదవ్ ,సురేష్, పవన్, వెంకటేష్, శ్రీకాంత్, అక్రమ్ ఖాన్, భానురెడ్డి,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Previous రాజధాని శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత : సి.వి.ఆనంద్
Next మీకోసం మేమున్నాం టీం 163 వ వారం అన్న దానం
ADVERTISEMENT