| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజధాని శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత : సి.వి.ఆనంద్

రాజధాని శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత : సి.వి.ఆనంద్


డైలీ భారత్ హైదరాబాద్ డెస్క్: రాజధాని శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సి.వి.ఆనంద్ అన్నారు.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాంతి భద్రతలు మరియు ఇతర విభాగాల పనితీరును మరింత మెరుగుపరచడానికి, వి.ఆనంద్ ఐపిఎస్   కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు  సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న 573 మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుళ్లను (మహిళలు-223 మరియు పురుషులు-350) హైదరాబాద్ సిటీలోని మొత్తం 71 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లకు -284, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్-225, స్పెషల్ బ్రాంచ్-25, టాస్క్ ఫోర్స్-25, హెచ్ న్యూ-8, సైబర్ క్రైమ్-6 అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఆదివారం ఐసిఐసిఐ భవనము, అడిటోరియం, బంజారా హిల్స్, రోడ్ నెం.12, హైదరాబాద్‌లో  573  సిఎఆర్ కానిస్టేబుళ్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించినారు. శిక్షణ అనంతరం 450 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 873 మంది సీఏఆర్ కానిస్టేబుళ్లు విధులకు హాజరయ్యారు. అదనంగా 200 మంది కానిస్టేబుళ్లను, మరో 100 మంది కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా, అదనంగా 10 ప్లాటూన్లకు కేటాయించిన తరువాత, మిగిలిన 573 మందిని పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్ మరియు ఇతర విభాగాలకు అటాచ్ చేస్తూ అక్కడ ఉన్నకొన్ని ఖాళీలను భర్తీ చేస్తూ మరియు  సివిల్ పోలీసుల విధులకు వీరితో  మరింత చేయూత అందుతుంది . వీరందరీ సుముఖత మరియు ట్రాక్ రికార్డ్‌లు పరిశీలించి మరియు సీనియారిటీ ఆధారంగా అటాచ్మెంట్ చేస్తూ,   వారికి పోలీసింగ్ మరియు చట్టాలు మరియు పౌరులతో ఎలా సంభాషించాలి అనే వివిధ అంశాలపై వారికి మూడు వారాల పాటు శిక్షణ ఇవ్వబడింది.

  ఈ సందర్భంగా  సి.వి.ఆనంద్ ఐపిఎస్   కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు  మాట్లాడుతూ మీరు సివిల్ పోలీసులతో మమేకమై పని చేయాలని సూచించారు. మీరు చాలా సహనం తో, వివిధ వర్గాల ప్రజల మధ్య పని చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని కావున, శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి ముఖ్య కర్తవ్యమన్నారు. సివిల్ పోలీసు విధుల్లో చేరిన ప్రతి ఒక్కరికీ  అభినందనలు తెలిపారు. ఇది కేవలం అటాచ్‌మెంట్ మాత్రమేనని, వారికి సీనియారిటీ లేదా విభాగముమార్పిడి హక్కులు ఉండవని, పోలీసు స్టేషన్‌లలో పెట్రోలింగ్ మరియు ప్రాథమిక విధులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న సివిల్ పోలీసుల కొరతను అధిగమించడానికి ఈ విధముగా అటాచ్‌మెంట్  చేస్తున్నామని వారికి తెలిపారు.

  హైదరాబాద్ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మనము హైదరాబాద్‌లో శాంతిభద్రతలను అదుపులో ఉంచాలని, నేరాలను అరికట్టాలని వారికి సూచించారు. అందువల్ల నేరాల నివారణకు పెట్రోలింగ్‌ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మన హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలని, అప్పుడే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, జీడీపీ పెరుగుతుందని, మన రాజధాని హైదరాబాద్ నగరానికి మంచి పేరు వస్తుందని, ఇందుకోసమే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని  వివిధ విభాగాలను బలోపేతం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

  విధుల్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమాచారం వచ్చినా, ఏదైనా సంఘటన చూసినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే ట్రాఫిక్‌ జంక్షన్‌ల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉందని, మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. మీరు పని చేస్తున్న ప్రదేశంలోని స్థానిక ప్రజలు మరియు పెద్దలతో స్నేహపూర్వకంగా ఉండేలా చూసుకోవాలి అని తెలిపారు.

  “మేము తీసుకున్న ఈ నిర్ణయానికి మీరందరూ రోల్ మోడల్‌గా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కోరారు”.

 ఈ కార్యక్రమములో  విక్రమ్ సింగ్ మాన్ ఐపిఎస్ అదనపు సిపి లా అండ్ ఆర్డర్ హైదరాబాదు పరిమళ హనా నూతన్ ఐపిఎస్ జాయింట్ సిపి అడ్మిన్, రక్షిత కృష్ణ మూర్తి ఐపిఎస్ డిసిపి సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Previous దమ్మపేట మండలం పుచికుంటా,కటుకూరు ఆదివాసి గ్రామాలలో పర్యటించిన తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి
Next జనంసాక్షి తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన బర్క కృష్ణ యాదవ్
ADVERTISEMENT