| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దమ్మపేట మండలం పుచికుంటా,కటుకూరు ఆదివాసి గ్రామాలలో పర్యటించిన తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి

దమ్మపేట మండలం పుచికుంటా,కటుకూరు ఆదివాసి గ్రామాలలో పర్యటించిన తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి


ఆదివాసి గ్రామాలలోనీ నిరుద్యోగ యువతకు ఐటీడీఏ ద్వారా ఉపాధి (లోన్లు) మరియు ఆదివాసి చట్టాలపై అవగాహన కల్పించాలి 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మారు ముల ప్రాంతం కటుకూరు,పుచికుంటా గ్రామాల్లో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు పర్యటించారు,తంబళ్ల రవి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు మరియు వంతెనలు శాంక్షన్ చేయటం చాలా సంతోషకరమని,పనులలో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని,ఈ గ్రామాలలో నివసించే ప్రతి ఆదివాసి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలని,అలాగే పెన్షన్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వారిని గుర్తించి ప్రభుత్వ ఫలాలు అందేలాగా చేయాలని, ఎప్పటినుంచో పోడు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,నిరుద్యోగ యువతకు ఐటీడీఏ ద్వారా లోన్లు ఇప్పించాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో తంబళ్ల రవి,వాసం పోలయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Previous దనసరి సీతక్క ని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా తుడుం దెబ్బ నాయకులు
Next రాజధాని శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత : సి.వి.ఆనంద్
ADVERTISEMENT