Posted on 2024-12-29 09:43:07
రిమాండ్ కి తరలింపు.
RMP లు తెలిసి తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలకు హానికలిగిస్తే క్రిమినల్ కేసులు తప్పవు.
ప్రజలు అనారోగ్యంతో ఉన్నపుడు కనీస వైద్యం తెలియని RMP ల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం సముద్రలింగపూర్ తుర్కషి కాలానికి చెందిన మహిళ మరణానికి కారణం అయిన RMP జజ్జరి దేవేందర్ ని అరెస్ట్ చేసి రిమండ్ కి తరలించడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.....
ఎల్లారెడ్డిపేట్ మండలం తుర్క కాసి కాలనీ, సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసింబి, వయసు 30 సంవత్సరాలు అనే మహిళకు 26 12 2024 రోజున జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ అయిన జజ్జరి దేవేందర్ వద్దకు వెళ్లగా RMP దేవేందర్ ఖాసింబిని పరిశీలించి ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇవ్వగా మరునాడు జ్వరం తగ్గకపోయేసరికి మరల దేవేందర్ వద్దకు తీసుకొని వెళ్లగా ఖాసింబికి గ్లూకోజ్ లు పెట్టగా ఖాసీంబి స్పృహ కోల్పోగా బంధువులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ 28 12 2024 రోజున మరణించినదని డాక్టర్లు తెలిపిగా,ఖాసింబి భర్త అయినమహమ్మద్ అజిమ్ RMP నిర్లక్ష్యం మేరకు తన భార్య చనిపోయిందని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేట్జిన్ లో పిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేయాగ,ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేసి RMP దేవేందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి...
ప్రజలు అనారోగ్యంతో ఉన్నపుడు కనీస వైద్య తెలియని RMP ల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ప్రభుత్వ వైద్య సదుపాయాలు, అర్హత కలిగిన వైద్యలను మాత్రమే సంప్రదించాలన్నారు.
జిల్లాలో ఉన్న RMP లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలే తప్ప క్లినిక్ ల పేరుతో తెలిసి తెలియని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు మీదకు తీసుకవస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా డిఎస్పీ హెచ్చరించారు.
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >