Posted on 2024-12-28 12:26:39
రూ.15 లక్షల డ్యూటీ ఫ్రీ లిక్కర్ సీజ్
మూడు కార్లు స్వాధీనం
ఐదుగురిపై కేసు నమోదు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అక్రమ లిక్కర్ దందా చేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు తోపాటు మరో ఇద్దరిని డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఔట్ పోస్టులో జేమ్యా నాయక్ కానిస్టేబుల్గా, బండారి లింగయ్య హోంగార్డుగా పని చేస్తున్నారు. ప్రయా ణికుల నుంచి వీరు టికెట్లను తీసుకుని ఎయిర్
పోర్టులో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొనేవారు.
ఆ తర్వాత వీటిని బయటకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ము కునేవారు.పక్కా సమాచారంతో వీరిద్దరితోపాటు వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు హరీశ్ కుమార్, రాఘవేందర్ను శుక్రవారం పక్కా సమాచారం తో అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ తెలిపారు.
నిందితుల నుంచి రూ.15 లక్షల విలువ చేసే 46 డ్యూటీ ఫ్రీ మద్యం బాటిళ్లతోపాటు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహేందర్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >