| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఫరూక్ నగర్ మండల బూర్గుల గ్రామానికి చెందిన మంగలి గోపాల్, ఎస్ జ్యోతి, మరియు మధురపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ గౌడ్ మామిడిపల్లి కి చెందిన యం.రాజు శ్రీనివాసుల గూడకి చెందిన పి.అంజయ్య లకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చెక్కులు అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఖరీదైన వైద్యం అవసరమయ్యే ఆరోగ్య సమస్యలు, బంధుమిత్రుల ప్రాణ నష్టం, ప్రకృతి వైపరీత్యాల వంటి అనూహ్య సంఘటనల కారణంగా ఆస్తులు మరియు జీవనోపాధిని కోల్పోవడం, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు మొదలైనవి జరిగినప్పుడు ఆదుకోవడానికే ముఖ్యమంత్రి సహాయనిది ఏర్పాటు చేయబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ మాజీ వైస్ ఎంపీపీ మాచారం హరికృష్ణ గౌడ్, మధురాపూర్ మాజీ సర్పంచ్ బొమ్మ రంగయ్య గౌడ్ మామిడిపల్లి మాజీ ఎంపిటిసి కాట్న మాధవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Previous భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటు : ఏలూరు కోటేశ్వరరావు
Next దేశం గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది :ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT