| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశం గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది :ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

దేశం గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది :ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్  మరణం దేశ ప్రజలకు తీరని లోటని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పట్టణ ముఖ్య కూడలిలో కార్యకర్తల తో కలసి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి మన మద్య లేకపోవడం బాధాకరం అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఈ సందర్బంగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భౌతికంగా వారు మనకు దూరం అయినా, ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు, చట్టాల రూపంలో భారతదేశ అభివృద్ధిలో సజీవంగా ఉంటాయాన్నారు.  ప్రధాని పీవీ నరసింహారావు  నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా గొప్ప ప్రణాళికలను రచించి, వాటిని అమలుచేసి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించారని కొనియాడారు. ప్రధానమంత్రిగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
Next వేణుగోపాల స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి
ADVERTISEMENT