డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి లో రుచి డైరీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని రుచి డైరీ కేంద్రం యజమాని సిద్ధార్థ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. అనంతరము రుచి డైరీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తల్లి పాల తర్వాత అంతటి మహోన్నతమైన పాలు ఇవ్వగలిగే శక్తి ఒక గోమాతకే ఉంది అని, పాలు మరియు పెరుగు వలన బలహీనుడు కూడా బలవంతుడిగా మారుతాడని, పెరుగు తినడం వలన జీర్ణాశయంలో మంచి ప్రో బయోటిక్ క్రిములు పెరిగి, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, శారీర రుగ్మతలకు దూరంగా ఉంటారని, జీర్ణక్రియ ప్రక్రియ సవ్యంగా ఉంటుందని అందుకొరకై మంచి నాణ్యత గల పాలు పెరుగును ప్రజలకు అందించి, ప్రజల శ్రేయస్సుకు తోడ్పడాలని యజమాని సిద్ధార్థ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, కొందుర్గు జడ్పిటిసి తనయుడు రామకృష్ణ, మహదేవ్ పూర్ రవిందర్, దినేష్ సాగర్, బిఆర్ఎస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News
రుచి డైరీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి