డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ నగర్ లోని పవర్ లూమ్ కార్మికులకు మేడికోవర్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నంచందర్, 21 వార్డు కౌన్సిలర్ వేముల రవి మాట్లాడుతూ పవర్ లూమ్ కార్మికుల ఆరోగ్య సమస్యలు పరిష్కరిచడం కోసం హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందని అన్నారు.
పోపా ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ, హెల్త్ క్యాంపులు, కార్మికుల పిల్లల కోసం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం శిక్షణ, ప్రతిభ పురస్కారాలు అందించడం లాంటి కార్యక్రమాల ద్వారా కార్మికుల్లో వారి పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్ ,ఈ.సి. జి. పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ కె.శ్రీకాంత్, డెంటల్ డాక్టర్ శివరామకృష్ణ, మెడికో సంజన లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య శిబిరంలో 200 మంది కార్మికులు వైద్య పరీక్షలు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ వేముల రవి, డాక్టర్ శివరామకృష్ణ, పోపా ప్రతినిధులు నాగుల శ్రీనివాస్, చిట్యాల రత్నాకర్, వాసాల హరి ప్రసాద్, కొక్కుల శ్రీనివాస్, కనుకుంట్ల మధు, బొల్లి భగవాన్, ఆంకారపు జ్ఞానోబ, కోడం శ్రీనివాస్, దాసరి తిరుమల, అలువాల ఈశ్వర్, ఆడేపు చక్రపాణి, రాము, నరేష్, రాజు, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది బూర్ల శ్రీమతి, రాపెళ్ళి లత, వేముల అన్నపూర్ణ లు పాల్గొన్నారు.