| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి : చల్లా నరసింహారెడ్డి

కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి : చల్లా నరసింహారెడ్డి

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.మంగళవారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి నేతృత్వంలో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత నరసింహారెడ్డి, తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై నిరసన ర్యాలీ ప్రదర్శనలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం కలెక్టరేట్ వద్ద విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ..

ప్రపంచంలోని అనేక దేశాలు మేధావిగా పేర్కొంటుంటే మన దేశంలో సాక్షాత్తు హోం మంత్రే ఇలా అవమానించడం సిగ్గు మాలిన చర్య అన్నారు. ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండే ఓ వైపు రాజ్యాంగంపై,మరో వైపు లౌకికవాదంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్యాంగంపై, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై అమిత్‌ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. గతంలో కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై అనూచిత వాక్యలు చేసిన తీరు బాధాకరమని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబెడ్కర్ పై అమిత్ షా మాట్లాడిన తిరుపై ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం స్పందించక పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్పాడుతామని హెచ్చరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్ముకు లేఖ రాసి జిల్లా కలెక్టర్ పంపించాలని అమిత్ షా పై చర్యలు తీసుకోవాలని కోరారు.అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై చర్యలు తీసుకునేంతవరకు ఇండియా కూటమి ఆందోళనలను కొనసాగిస్తుందని వారు పేర్కొన్నారు.

Previous తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి
Next హాజిపల్లి రైతుల అంశాన్ని కలెక్టర్ కు వివరించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
ADVERTISEMENT