14 రోజులు నుంచి సమ్మె చేస్తున్నటువంటి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేస్తున్నటువంటి కాంట్రాక్టు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ 14 రోజుల నుంచి ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి ఎలాంటి చలనం రాకపోవడం చాలా బాధాకరమని,ఎంతో ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంనీ గెలిపించుకున్న కూడా ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కల్సి పరిస్థితి ఏర్పడిందని,ప్రభుత్వం వెంటనే వారి సమస్యలకు స్పందించాలని,ఉద్యోగస్తులు సమ్మెలో ఉండటం కారణంగా పిల్లల చదువులు కు ఇబ్బంది కలుగుతుందని,సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని,అప్పటి వరకు పేస్కేలు ఇవ్వాలని,ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు..ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి,ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియమాలలో వెయిటెజ్ కల్పించాలని,సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి డిమాండ్లు నెరవేర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు.