డైలీ భారత్, అశ్వరావుపేట:జానపద కళాకారుడు బలగం మూవీ ఫేమ్ మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆనారోగ్య పరిస్థితి విషమించి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు...
వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబల్ల రవి