సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తేదీ 10 -11- 2024 రోజున KCR నగర్ మండపల్లి గ్రామం తంగళ్ళపల్లి మండలానికి చెందిన మహ్మద్ సిరాజ్ , s/o ఆఫ్జల్, 45 సంవత్సరాలు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో తన ఆటోలో గొల్లపల్లిలోని దర్గాకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి తన అత్తగారి ఇల్లు అయిన చంద్రంపేటకు వెల్లుతుండగా అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు కొత్తచెరువు వద్ద ఆటోలో ఏదో శబ్దం వస్తుందని ఆటోను రోడ్డు పక్కన ఆపి చెక్ చేస్తుండగా సిరిసిల్ల నుండి వేములవాడ వైపు ఒక కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఉంటున్న రాజస్తాన్ చెందిన కైలాష్ రామ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆటో పక్కన నిలబడి ఉన్న సిరాజు ని ఢీకొట్టగా సిరాజ్ కు త్రివగాయలు కాగా తేదీ 18-11-2024 రోజున కరీంనగర్ లోని ఆస్పత్రిలో ఉదయం చనిపోగా సిరాజ్ భార్యా అప్రిన్ ఫిర్డోజ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందిని సి.ఐ తెలిపారు.ఎవరైనా మద్యం తాగి వాహనాలను నడిపి ఇతరుల మరణాలకు కారణమైనట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని బడతాయి కావున ఎవ్వరు కూడా మద్యం సేవించి వాహనాలను నడపవద్దని డిఎస్పీ తెలిపారు.