| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మైనర్ బాలికను వేధించిన(పొక్సో) కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా

మైనర్ బాలికను వేధించిన(పొక్సో) కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలికను వేధించిన(పొక్సో) కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 1000/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత సోమావారం రోజున  తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

2018 సంవత్సరం ఏప్రిల్ 12 వ తేదీన వేములవాడకి చెందిన బాలికను ఆమె ఇంటి దగ్గరలో వుండే దొమ్మటి ఆనంద్, గొల్లపల్లి శశి, పబ్బ రాజేష్, గౌరవెని నాగరాజు, సయ్యద్ సోహెల్, బొమ్మడి గణేష్ లు తనను లైంగికoగా వేధిస్తున్నారని వేములవాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి పట్టణ సి.ఐవెంకటస్వామి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.   

ప్రాసిక్యూషన్ తరపున పి.పి. పెంట శ్రీనివాస్ వాదించగా, CMS  ఎస్.ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్  కానిస్టేబుల్లు నరేందర్, మహేందర్ లు కోర్టులో 8 మంది సాక్షులను ప్రవేశపెట్టాగా,కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత ఆరుగురు నిందుతులకు ఒక సంవత్సరం జైలు శిక్ష,ఒక్కక్కరికి 1000/- రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

పైకేసులలో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ పెంట శ్రీనివాస్,,CMS  ఎస్.ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ లు నరేందర్, మహేందర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Previous ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారి
Next మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు, రిమాండ్ కి తరలింపు
ADVERTISEMENT