నూతన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పిలుపు
ఈనెల 27న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం
స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం
హాజరుకానున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు తదితరులు
నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల శ్రేణులు హాజరుకావాలని పిలుపు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ ప్రభుత్వ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈనెల 27న బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేస్తున్నట్లు నూతన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ప్రముఖులు, అధికారులు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా విభాగాల వారు పెద్ద ఎత్తున హాజరుకావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇదే ఆహ్వానంగా భావించి, కార్యకర్తలు నాయకులు పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశాలతో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు..