| Daily భారత్
Logo




చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం!

News

Posted on 2024-10-25 13:19:17

Share: Share


చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం!

ముదిరాజులకు పెద్దపీట వేస్తనంట్టివి కదా రేవంత్ రెడ్డి!

గత ప్రభుత్వం పుష్కలంగా చెరువులకు సరిపడ చేపపిల్లలు ఇస్తే రేవంత్ రెడ్డి మమ అంటుండు! 

గౌరవేని సుమన్ ముదిరాజ్

బిఆర్ఎస్  నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల.

చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం!

ముదిరాజులకు పెద్దపీట వేస్తనంట్టివి కదా రేవంత్ రెడ్డి!

గత ప్రభుత్వం పుష్కలంగా చెరువులకు సరిపడ చేపపిల్లలు ఇస్తే రేవంత్ రెడ్డి మమ అంటుండు!

చేపపిల్లల సంఖ్య సగానికి తగ్గిస్తే ఎలా..

గతేడాది ఇచ్చిన దానిలో 50 శాతమే ఇవ్వడం సబబు కాదు

ఇది ముదిరాజ్ సామాజిక వర్గానికి నష్టం కలిగిస్తుంది

⁠దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బ తింటుంది

ముఖ్యమంత్రికి సూటి ప్రశ్నవేసిన ముదిరాజ్, యువకులు 

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఏడాది చెరువులు, కుంటల్లో వేయడానికి గత ఏడాది ఇచ్చిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఇస్తామని ప్రభుత్వం నిబంధన విధించి, ఆ ప్రకారంగానే చేప పిల్లలను సరఫరా చేయడం సమంజసం కాదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు గౌరవెని సుమన్  & ముదిరాజ్ యువకులు పేర్కొన్నారు.

ఈ విధంగా చేయడం వల్ల చేపల ద్వారా ఉపాధి పొందే ముదిరాజ్ సామాజికవర్గానికి నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని వారన్నారు.

ఈ విషయంగా శుక్రవారం వారి గ్రామం బొటిమీది పల్లె లో  వారు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. 

గత ఏడాది చెరువులకు సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఈ ఏడాది సరఫరా చేస్తున్నారనే విషయం చాల వేదన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది చెరువులు, కుంటల్లో చేప పిల్లలను విడుదల చేసే విషయంగా రాష్ట్ర ఫిషరీస్ డైరెక్టర్ Memo No.CF-C/2/1/2024 DDIND, తేదీ 15.08.2024 జారీ చేసారని తెలిపారు. ఈ మెమో ప్రకారంగా రాష్ట్రంలో గత ఏడాది సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యలో ఈ ఏడాది 50 శాతం మాత్రమే సరఫరా చేయాలని ఆంక్షలు విధించారని చెప్పారు. దీని వల్ల గత ఏడాది లక్ష చేప పిల్లలు సరఫరా చేసిన చెరువులకు ఈ ఏడాది 50 వేల చేప పిల్లలను మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. 

 గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్న ఈ ఏడాది వర్షాలు సరిగా కురవలేదంటూ ఫిషరీస్ డైరెక్టర్ తన మెమోలో సాకుగా చూపించి చేప పిల్లల సంఖ్యను సగానికి తగ్గించేయడం సమంజసం కాదని విమర్శించారు. 

దీని వల్ల ఈ ఏడాది చెరువుల్లో చేపల సంఖ్య సగానికి తగ్గి పోతుందని, ఈ చేపల వేటపై ఆధారపడి జీవించే ముదిరాజ్ కుటుంబాల ఆదాయం కూడా సగానికి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. 

ఈ విధంగా చేప పిల్లల సంఖ్యను సగానికి తగ్గించేసి, ముదిరాజ్ కుటుంబాల ఆదాయాన్ని తగ్గించడం ముదిరాజుల భవిషత్తు దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేసారు.

అందుకే ఈ విషయంగా ముఖ్యమంత్రి కల్పించుకొని చెరువులు, కుంటలకు గత ఏడాది ఏ స్థాయిలో చేప పిల్లలను ఇచ్చారో, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా చేప పిల్లలను సరఫరా చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సుమన్ ముదిరాజ్,& యువకులు కోరారు. 

తక్షణమే ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి పునరాలోచన చేసి గత ప్రభుత్వం మాదిరిగా చేపపిల్లల పంపిణీ చేపట్టకుంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.

Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >