| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దుర్గామాత నిమార్జనానికి బయలుదేరిన శ్రీనగర్ కాలనీ వాసులు

దుర్గామాత నిమార్జనానికి బయలుదేరిన శ్రీనగర్ కాలనీ వాసులు

*అలంపూర్ సమీప నది తుంగబద్రలో అమ్మవారి నిమర్జనం*

*నవరాత్రులు నిష్ఠతో పూజలందుకున్న అమ్మవారు*

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ శ్రీనగర్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన దుర్గామాత మాత శరన్నవారాత్రులు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జమాల్పూర్ చందూలాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి రోజు ఒక్కొక్క అలంకరణలో మరియు నిష్ఠతో పూజలు చేశారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భజనలు, పిల్లలకు దేవుళ్ళ వేషధారణ, కుంకుమార్చన, ఒడిబియ్యం నింపడం, మహిళలు బతుకమ్మ, కోలాటాలు ఆటలు ఆడి పాడారు. అన్నదానం కార్యక్రమం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి రోజు ఒక ముఖ్య అతిథులు స్థానిక ఎమ్యెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ కమీషనర్ చీమ వెంకన్న, పోలీస్ అధికారులు తో పాటు ఇతర నాయకులు, అధికారులు ఇలా అందరి సహకారంతో అమ్మవారికి పూజలు నిర్వహించి ఈరోజు అమ్మవారిని నిమార్జనం చేయడానికి కాలనీలో ని అధిక సంఖ్యలో మహిళలు,సురేష్,విష్ణువర్ధన్ రెడ్డి,శివ, కాలనీ పెద్దలు, యువకులు మరియు కాలనీ కమీటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

Previous ఏపీ సీఎం చంద్రబాబుని కలిసి వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్‌ను అంద‌జేసిన చిరంజీవి
Next ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
ADVERTISEMENT