| Daily భారత్
Logo




ఏపీ సీఎం చంద్రబాబుని కలిసి వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్‌ను అంద‌జేసిన చిరంజీవి

News

Posted on 2024-10-13 23:00:38

Share: Share


ఏపీ సీఎం చంద్రబాబుని కలిసి వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్‌ను అంద‌జేసిన చిరంజీవి

డైలీ భారత్ తెలంగాణ :ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా ఆదివారం హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో క‌లిశారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు సంభ‌వించి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ త‌మ వంతుగా ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తుని ప్ర‌క‌టిస్తూ విరాళాల‌ను అంద‌జేసింది. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌తీసారి సినీ ప‌రిశ్ర‌మ నుంచి త‌న వంతు మ‌ద్ధతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియ‌చేస్తుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ క‌లిసి తెలుగు రాష్ట్రాల‌కు త‌లో కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా చంద్ర‌బాబు నాయుడుని క‌లిసిన చిరంజీవి త‌న యాబై ల‌క్ష‌ల రూప‌యాల‌ చెక్‌తో పాటు, రామ్ చ‌ర‌ణ్ యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను.. మొత్తం కోటి రూపాయ‌ల చెక్‌ల‌ను అంద‌జేశారు.

Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >
Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >