Posted on 2024-10-04 19:24:42
వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్
మొబైల్ ఫోను, 6వేలు స్వాధీనం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు కష్టపడకుండా ధనవంతులుగా మారాలనే దుర్బుద్ధితో నక్సలైట్ అవతారమెత్తి అమాయకులను బెదిరించి పోలీసులకు పట్టుబడిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల. గిరిధర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, మామిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి మాజీ నక్సలైట్ గా చెప్పుకొని సోలిపూర్ గ్రామానికి చెందిన తేనేటి శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి రైస్ మిల్లు అసోసియేషన్ నుండి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నేను మాజీ నక్సలైట్ నని చెప్పి అడిగిన డబ్బులు వెంటనే ఇవ్వకుంటే మిమ్మల్ని చంపుతానని చెప్పి బెదిరించాడు.తేనేటి శేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఘనపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని సాంకేతిక సహాయం, కేసు పరిశోధనలో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడి కోసం గాలిస్తుండగా ఖిల్లాఘణపురం బస్టాండ్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా నిందితుడిని ఖిల్లాఘనపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో నిందితుడు తను చేసిన నేరం ఒప్పుకున్నాడు .గతంలో సుదర్శన్ రెడ్డి ఆత్మరక్షణ మేరకు గన్ లైసెన్స్ తీసుకొని అక్కడ నుండి హైదరాబాదులోని ముషీరాబాద్ 2000 సంవత్సరంలో వచ్చి చార్మినార్లో వెపన్ 3.2 రివాల్వర్ జర్మనీ కంపెనీకి చెందిన దానిని కొన్నాడు. ఇక్కడ ఒక సంవత్సరం నుండి హబ్బిగూడలో అపార్ట్మెంట్లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.తన దగ్గర ఉన్న రివాల్వర్ చూపించి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసేవాడు.ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్స్ వర్క్ ప్రారంభించాడు.
2015 నుంచి అతనికి వ్యాపారంలో అప్పులు కావడంతో ఎలాగైనా ఆర్థికంగా ఎదగాలని చేసిన అప్పులను తీర్చాలనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న రివాల్వర్ చూపించి బెదిరించి 15 లక్షల ఇవ్వాలని పెద్దపల్లిలోని ఒక రైసుమిల్ ఓనర్ను బెదిరించి డబ్బులు తీసుకున్నాడు.
ఆ తర్వాత అదే విధంగా మరి కొందరిని బెదిరించి ఎక్కువ డబ్బులు సంపాదించడంతో సుల్తానాబాద్, కరీంనగర్, సుబేదారి, మిర్యాలగూడ, వంటి ఏరియాలలో కూడా కొంతమందిని డబ్బులు ఇవ్వాలని బెదిరించినాడు. ఆ ఏరియాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో అరెస్టయ్యి జైలు పాలయ్యాడు.
అదేవిధంగా జస్ట్ డయల్ ఆప్ అనే వారికి ఫోన్ చేసి వనపర్తి జిల్లాలోని కొంతమంది రైసుమిల్ యాజమానుల నంబర్లు ఇవ్వాలని కోరగా కొందరి నెంబర్లు వారు ఇచ్చారు. అదేరోజు రాత్రి అందాజ 10 గంటల సమయంలో ఆ నెంబర్లలో ఒకటైన శేఖర్ రెడ్డి నెంబర్ కు ఫోన్ చేసి తాను నక్సలైట్ను అని రైస్ మిల్లర్ అసోసియేషన్ నుంచి 50 లక్షలు ఇవ్వాలని లేకపోతే చంపుతానని ఈ విషయం ఎవరికైన చెప్పుతే చంపుతానని బెదిరించాడు. తేదీ :02-10-2024 నాడు ఉదయం 9 గంటల సమయంలో బోడుప్పల్ లోని మనీ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్లి తెలిసినవారు డబ్బులు వేస్తారు. నీ ఫోన్ పే నెంబరు ఇవ్వమని అడిగి తీసుకొని శేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి అత్యవసరంగా 8 వేల రూపాయలు ఫోను పే చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు దీంతో అతను భయపడి ఫోన్ పే చేసినాడు. ఆ తర్వాత కూడా ఇంకా డబ్బులు కావాలని శేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ బెదిరించి లేకపోతే మీ ఫ్యామిలీని చంపుతానని బెదిరించాడు ఖిల్లాఘనపూర్ ఎస్సై నిందితుడిపై నిఘా పెట్టీ చాకచక్యంగా అదుపులోకి తీసుకొని విచారించగా నిజాలను ఒప్పుకున్నాడని జిల్లా ఎస్పీ తెలిపారు.ఇలాంటి చర్యలకు ఎవరైనా పాలు పడితే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.ఈ కేసును తొందరగా చేదించిన కొత్తకోట సీఐ ,రాంబాబు, ఖిలా ఘనపూర్ ఎస్సై, సురేష్ పోలీస్ కానిస్టేబుళ్లు, లింగం రాజులను జిల్లా ఎస్పీ అభినందించారు.
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >