Posted on 2024-09-21 10:26:20
డైలీ భారత్, కామారెడ్డి: టీనేజ్, యంగ్ ఏజ్ లో యువతీ, యువకులు ప్రేమ మైకంలో ఉంటారు. కొందరికి ఆ ప్రేమ జీవితాన్నిస్తే.. మరికొందరిపాలిట శాపంగా మారుతుంది. ప్రేమికుల తల్లిదండ్రుల మధ్య ఇప్పటికీ కూడా కులాలు చిచ్చుపెడుతున్నాయి.
పరాయి కులం, ఇతర మతస్తులను ప్రేమిస్తే ససేమిరా ఒప్పుకోవట్లేదు. తమని కాదని పెళ్లిచేసుకుంటే పరువు హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది.
దోమకొండ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్, అంబర్పేటకు చెందిన వీణ వీరిద్దరూ కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లి చేయాలని అడుగగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. దాంతో ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేం అనుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయికుమార్, వీణ ల ఆత్మహత్యలతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇరువురి మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >