| Daily భారత్
Logo




ఇకపై ట్రాఫిక్ నియంత్రణలో వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు

News

Posted on 2024-09-14 06:30:39

Share: Share


ఇకపై ట్రాఫిక్ నియంత్రణలో వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు

వినూత్న ప్రయోగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిర్ణయం

ఆసక్తి గల ట్రాన్స్ జెండర్ ల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశం

విధుల్లో ఉండే ట్రాన్స్ జెండర్ లకు ప్రత్యేక యూనిఫాం

యూనిఫామ్ నమూనా చిత్రాలు విడుదల

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్  నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. 

ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్ గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి  సూచించారు. 

ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని,  దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్​జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. 

వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్​జెండర్లకు  ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.

Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >