| Daily భారత్
Logo




సమాజంలో బీసీలకు సమాన గౌరవ హోదా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-30 00:00:37

Share: Share


సమాజంలో బీసీలకు సమాన గౌరవ హోదా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

శాసనసభలో వెనుకబడిన తరగతుల సంక్షేమం అంశంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రసంగం

బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతపై ఆనందం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి, నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది మిగతా వర్గాలతో సమాన హోదా ఇచ్చి పెద్ద ఎత్తున గౌరవించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనియాడారు. శాసనసభలో వెనుకబడిన తరగతుల సంక్షేమం అంశంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రసంగించారు. బీసీ సంక్షేమ శాఖకు గత ప్రభుత్వ బడ్జెట్లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించిందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని ప్రజలలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో-ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో-ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారని ప్రభుత్వాన్ని అభినందించారు. తెలంగాణ తాడీ టాపర్స్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కు రూ.68 కోట్లు.

ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు.. నాయీబ్రాహ్మణ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కు రూ.100 కోట్లు, వాషర్మెన్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కు రూ.150 కోట్లు.. ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారని బలహీన వర్గాలకు సంబంధించిన బడ్జెట్ అంశంపై సభలో ఎమ్మెల్యే శంకర్ సుదీర్ఘంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చురకలు అంటిస్తూ సాగిన ప్రసంగంపై పలువురు ఎమ్మెల్యే శంకర్ ను అభినందించారు. అదేవిధంగా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ రజకవృత్తిలకు సంబంధించి మాట్లాడుతున్న సమయంలో ఈ సభలో ఇంతమంది ఇంత పరిశుభ్రంగా కనిపిస్తున్నారంటే దానికి రజకులు నాయి బ్రాహ్మణులు కారణమంటూ ఎమ్మెల్యే శంకర్ గర్వంగా చెప్పారు. మరి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు.

Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >