Posted on 2024-07-29 11:30:07
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వాణిజ్యపన్నుల శాఖలో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ను ఏ-5 గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్గా వ్యవహరించిన సోమేశ్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ (సేల్స్ టాక్స్) ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు (ఏ-1), డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ (ఏ-2), ప్రొఫెసర్ శోభన్బాబు (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్), ప్లియాంటో టెక్నాలజీస్ (ఏ-4)ను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపిసి లోని 406, 409, 120-బి ఐటీ యాక్టులోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖలో గతేడాది డిసెంబరులో బిగ్ లీప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇన్పుట్ టాక్స్ పేరుతో రూ.25 కోట్లు మోసం చేసిందనే వ్యవహారంతో దర్యాప్తు మొదలుపెట్టగా శాఖలోని అధికారులే అందుకు సహకరించినట్టు తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసి అనుమానిత అధికారులకు నోటీసులు జారీచేయడం, వారి నుంచి వివరణలు రావడం, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం, తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం... ఈ తతంతమంతా జరిగిన తర్వాత హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్వేర్ లోని డేటా మొత్తం థర్డ్ పార్టీకి వెళ్లినట్టు తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు సైతం ఇందులో సంబంధం ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా రూ.450 కోట్ల విలువైన కుంభకోణం జరిగినట్టు స్పష్టమైంది. ఇందులో రాష్ట్ర బేవరెజెస్ కార్పొరేషన్ సైతం లబ్ధిదారుగా ఉన్నట్టు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు.
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సూచనల మేరకే శోభన్బాబు ఆ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టు పోలీసులకు అర్థమైంది. ఈ విషయం గురించి నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరిస్తూ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నుంచి ఫిర్యాదు వచ్చిందని, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సహా మొత్తం ఐదుగురిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు అనంతరం వివరాలు తెలుస్తాయన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 17:47:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 17:34:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 17:33:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >