| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కోట్లు కొట్టేశాడు...లక్షతో దొరికాడు...

కోట్లు కొట్టేశాడు...లక్షతో దొరికాడు...

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: విలాసవంతమైన జీవితం గడపాలని భారీ చోరీపరారైన యువకుడి అరెస్టు...

విలాసవంతమైన జీవితం గడపాలని ఓ యువకుడు ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.2.20 కోట్ల నగదు కొట్టేశాడు.

అప్రమత్తమైన పోలీసులు ఒక్క పూటలో అతడిని పట్టుకొని, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. అశోక్‌కుమార్‌ అనే యువకుడు రాజమహేంద్రవరంలో ఏటీఎంలలో నగదు పెట్టే ప్రైవేటు ఏజెన్సీలో పనిచేసేవాడు. శుక్రవారం తను పనిచేసే ఏజెన్సీ ఇచ్చిన చెక్కు ద్వారా బ్యాంకు నుంచి రూ.3,32,50,000 తీసుకున్నాడు.

ఇతర సభ్యులకు రూ.1.12 కోట్లు ఇచ్చి ఏటీఎంలలో పెట్టేందుకు వెళ్లాలని చెప్పి.. అంతకుముందే ఏర్పాటుచేసుకున్న అద్దె కారులో రూ.2,20,50,000తో పరారయ్యాడు. నగర శివారులో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో కొంత డబ్బుపెట్టి బయటపడ్డాడు. ఎవరూ గుర్తుపట్టకుండా గుండు కొట్టించుకొని, మీసాలు, గెడ్డం తీసేశాడు. 

అక్కడ్నుంచి కారులో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటకు చేరుకున్నాడు. కారు యజమానికి రూ.50వేలు చెల్లించాడు. బైక్‌పై తెలిసిన వారింటికెళ్లి రూ.9లక్షలు ఇచ్చాడు. చివరికి మండపేట సమీపంలోని బైక్‌పై వెళ్తున్న అశోక్‌కుమార్‌ను పోలీసులు తనిఖీ చేయగా అతనివద్ద రూ.లక్ష లభించింది.

అనుమానం వచ్చి పూర్తిగా విచారిస్తే చోరీ చేసినట్లు తేలింది. దీంతో వెంటనే అరెస్టుచేశారు. పెద్ద వ్యాపారం చేయాలి, విలాసవంతంగా జీవించాలని చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన డీఎస్పీ విజయ్‌పాల్, ఎస్‌బీ సీఐ సూరి అప్పారావు, మూడో పట్టణ సీఐ వీరయ్యగౌడ్, ఐటీ కోర్‌ ఎస్సై ఎం.అయ్యప్పరెడ్డి, ఇతర బృందాన్ని ఎస్పీ అభినందించారు.

Previous అంధుని జీవితానికి పోలీసుల ఆసరా
Next గర్భరక్షాంబికా ఆలయం గురించి మీకు తెలుసా?
ADVERTISEMENT