| Daily భారత్
Logo




కొంచెం మోదం...కొంచెం ఖేదం

News

Posted on 2024-07-24 08:38:42

Share: Share


కొంచెం మోదం...కొంచెం ఖేదం

డైలీ భారత్, (స్పెషల్ స్టోరీ) : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం(3.0) పూర్తి స్థాయి బడ్జెట్ ను  ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై సబండ వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కార్మిక, కర్షక అనుకూల విధానాలు ఉంటాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అభివృద్ధి ఉరకలేస్తుందని ప్రజలంతా భావించారు.నవ ప్రాధాన్యాలు నిర్ణయించుకుని వాటని సాధించడం ద్వారా వికసిత్ద్భారత్ సాధిస్తామని ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించడం ద్వారా, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానీకి ఈ నిర్ణయం దోహదపడుతుంది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించే లాగా బడ్జెట్ ఉంది. మధ్యతరగతి ప్రజలకి ఈ నిర్ణయం చాలా ఉపయోగకరం.

మోడీ 3.0 ప్రభుత్వానికి కావలసిన పూర్తిస్థాయి మద్దతునిచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బీహార్లకి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కానీ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పక్షపాతంతో నిధులు కేటాయించినట్టుగా ఈ బడ్జెట్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో లాగే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో నిర్లక్ష్యం ఎదురైంది.

దశాబ్ద కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నట్టుగా ఈరోజు ప్రకటించింది.నూతన వంగడాల ప్రోత్సాహం,  వ్యవసాయ రంగంలో పరిశోధనారంగాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం కనీస మద్దతు ధరకి ప్రాధాన్యత నివ్వడం హర్షణీయం. మద్దతు ధర విషయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వారికి ఇచ్చే మద్దతు ధర సామాన్య మద్దతు ధర ఒకే రకంగా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుంది.ప్రభుత్వ ప్రాధాన్య అంశాలలో అంతర్గతంగా పరిశీలిస్తే వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ  చేసేదిశగా ప్రతిపాదనలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దేశంలో ఇప్పటికి దాదాపు 60 శాతం ప్రజలు వ్యవసాయ వ్యవసాయరంగా అనుబంధ విభాగాలపై ఆధారపడుతున్నారు. ఈ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.గ్రామీణ అభివృద్ధి రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టారు. గ్రామీణ వ్యవస్థ పట్టణ వ్యవస్థతో అనుసంధానం సాధ్యమవుతుంది.

ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 30% నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగిత ప్రధాన సమస్యగా ఉంది. దీనికోసం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తూ ఉపాధి మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా మనకు అర్థం అవుతుంది. యువతలో నైపుణ్యాలు పెంచడం కోసము ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. భారతీయ యువత ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా విద్య ఉపాధి నైపుణ శిక్షణ సంస్థల్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించడం సంతోషదాయకం.

వేతన జీవులకు తీవ్ర నిరాశ

ఉద్యోగులు పన్ను చెల్లింపు దారులు ఆదాయపన్ను పరిమితి పెంపు కోరుకున్నారు .దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉన్నందున వేతన జీవుల ఆర్థిక భారాన్ని తగ్గించేలా బడ్జెట్ ఉండాలని కోరుకున్నారు.

ఆదాయ పరిమితులు పెంచాలని ఈ కొత్త పాత ఆదాయ పనుల్లో ఉన్న  రాయితులపై తికమక పెట్టకుండా రెండింటిని కలిపి ఆదాయపన్ను పరిమితిని కనీసం ఐదు లక్షలకు పెంచుతుందని  ఆశించారు. ప్రస్తుతం ఉన్న పనులు చెల్లింపుదారులను కొత్త ఆదాయపరిమితిలోకి తీసుకువచ్చే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం టాక్స్ రిలీఫ్ ను ఇవ్వలేదని మనకు అర్థం అవుతుంది. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల సామాన్య మధ్యతరగతి వేతన జీవులు తీవ్ర మీద నిరాశకు లోనయ్యారు..స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంచారు.కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఈ బడ్జెట్ కొంత ఊరట కలిగింది.

కరోనా తర్వాత దేశంలో స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం చాలా పెరిగింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లపై అవగాహన లేక సగటు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో మోసపోకూడదనే ఉద్దేశంతో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ STT ని పెంచడం జరిగింది. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ నీ నియంత్రించే చర్యలు చేపట్టాలి.

జీవితంలో అతిపెద్ద పెట్టుబడి ఇల్లు దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు ఒకవైపు అధికంగా ఉన్న స్థిరస్తు ధరలు మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ట స్థాయిలో కొనసాగుతూ ఉండడం వల్ల సొంత ఇంటి కలలు నెరవేర్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. నిరుపేద పేదలకు 10 లక్షల ఇల్లు కట్టించడం కోసం ప్రణాళికలు ఈ బడ్జెట్లో సిద్ధం చేశారు.

జాతీయ విద్యా విధానం -2020 ప్రకారం జిడిపిలో విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఈ బడ్జెట్లో కేవలం (₹1,25,638) 3.25% మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ విద్యా రంగం నిర్లక్ష్యానికి గురైనట్లుగా మనకు అవగతం అవుతుంది.బడ్జెట్లో 30% విద్య నైపుణ్య అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కోటి మంది యువతకి ఇంటర్న్షిప్ ద్వారా నైపుణ్య అభివృద్ధి చేస్తామని టార్గెట్ నిర్ణయించుకుంది.కానీ భారతదేశంలో స్కూల్ స్థాయిలో డ్రాప్ అవుట్ రేట్లు. ఆందోళన కలిగిస్తున్నాయి బీహార్ 20.5% ఒడిస్సా 27.3% తెలంగాణ 13.7% ఆంధ్రప్రదేశ్ 16.3% అస్సాం 20.3% గుజరాత్ 17.9% అండగా తక్కువ డ్రాపోర్ట్స్ ఢిల్లీ 4.8% తమిళనాడు 4.5% కేరళ 5.5% హిమాచల్ ప్రదేశ్ 1.5 %ఉత్తరాఖండ 5,%  ఆందోళన కలిగిస్తున్నాయి. యువతలో నైపుణ్యం పెంపు కోసం ఈ బడ్జెట్ లో నైనా ఐఐటీలో ఎన్ఐటీలు ఏర్పాటు  చేస్తారని ఆశించారు కానీ నిరాశ మిగిలింది. భారతదేశంలో నైపుణ్య పెంపుదల లో ఉన్నత స్థానంలో ఉన్న ఐఐటీలు ఎన్ఐటీలు ఐఏఎంలపై దృష్టి పెట్టకపోవడం బాధాకరం. ప్రభుత్వ విద్యా రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన నాణ్యమైన విద్య అందించడం కోసం మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

నూతన పెన్షన్స్ స్కీం పై ఒక విధానపరమైన నిర్ణయం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశించాయి కానీ దానిపై ఏ నిర్ణయం లేకుండా దాటేసే ధోరణి ప్రదర్శించింది.

విద్య వైద్య రంగాలకి అధిక నిధులు కేటాయించి నైపుణ్యాభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెడితే భారతదేశం ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలుస్తుంది. ఆ దిశగా చేస్తారని ఆశిద్దాం. పెద్దరికం నిరుద్యోగం, ద్రవయోల్బణం లను అధిగమించి సామాన్య ప్రజల సంక్షేమానికై పాటుపడితే తప్పకుండా భారత్ వికసిద్భారత్ గా మారుతుంది.




పాకాల శంకర్ గౌడ్

9848377734

సామాజిక రాజకీయ విశ్లేషకులు

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >