Posted on 2024-07-23 06:14:38
భారతదేశ రాష్ట్రాలలో ఆందోళనకరంగా వైరస్‌ల విజృంభణ
తాజాగా చాందీపురా,నిఫా,జికా... కల్లోలం..
హైదరాబాద్ లో నార్వక్ వైరస్ కల్లోలం
అప్రమత్తంగా ఉండాలని సూచించిన డాక్టర్ల బృందం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిఫా, జికా, చాందీపురా ప్రాణాంతక వైరస్‌లు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అటు ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు చాందీపురా వైరస్‌తో సతమతమవుతుంటే, మహరాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది.
వీటికి తోడు కేరళలో నిఫా వైరస్ జోరు పెంచింది. మొత్తానికి 3 ప్రాణాంతక వైరస్‌లు 4 రాష్ట్రాలను వణికిస్తున్నాయి.
తాగాగా గుజరాత్‌లో 50మంది చాందీపురా వైరస్ బారిన పడితే..వారిలో 16 మంది మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.
గుజరాత్‌లో రోజు రోజుకూ చాందీపురా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.
దాని పొరుగున ఉన్న మహారాష్ట్ర 2021 నుంచి అత్యధిక సంఖ్యలో జికా వైరస్ కేసులతో పోరాడుతోంది.
మరోవైపు కేరళ రాష్ట్రంలో మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ సోకి మరణించడంతో కేరళ ప్రభుత్వం వైరస్ నివారణ చర్యలను వేగవంతం చేస్తోంది.
ఇది అంటువ్యాధి కావడంతో వైరస్ విస్తరించకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
చాందీ పూర వైరస్ సోకిన సాండ్‌ఫ్లైస్ లేదా డ్రైన్‌ఫ్లైస్ నుంచి కాటు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా చాందీపురా 50 కేసులు నమోదైతే వారిలో 16 మంది మరణించారు. వైరస్‌ని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభావిత జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేస్తున్నారు.జ్వరసంబంధమైన కేసులకు ఇంటెన్సివ్ చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నర్సులతో పాటు ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు వంటి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం, చందీపురా వైరస్‌కు నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు, కాబట్టి రోగలక్షణ నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు సంక్లిష్టతలను నివారించడంలో సహాయక సంరక్షణ అవసరం.
హైదరాబాద్‌లో నార్వాక్ వైరస్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి నార్వాక్ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు. చికిత్స అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్ ప్రబలుతుందని వైద్యులు అంటున్నారు . తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలేని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని చెబుతున్నారు.
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >