Posted on 2024-07-21 10:05:54
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక శ్రీ దాశరధి కృష్ణమాచార్య అవార్డు 2024 సంవత్సరానికి గాను ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథంకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, కోశాధికారి పర్కాల రవీందర్,తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి అడేపు లక్మన్ జిల్లా అధ్యక్షులు వెంగలి నాగరాజు...
వారు మాట్లాడుతూ... సాహితీ ప్రపంచానికి ఎనలేని సేవ చేస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ సామాన్యుల జీవితాలే ఇతివృత్తాలుగా అనేక రచనలు చేసిన అభ్యుదయ కవి, రచయిత జూకంటి అని అన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించడం గర్వకారణమని అన్నారు.
జూకంటి విశేషాలు....
జూకంటి జగన్నాథం తెలంగాణకు చెందిన వచన కవి, కథకులు. 14 కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం వెలువరించారు.
జననం 1955 జూన్ 20 (వయసు 69)
తంగళ్లపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లా , తెలంగాణ,
జగన్నాథం 1955, జూన్ 20న దుర్గయ్య-సుశీల దంపతులకు రాజన్న సిరిసిల్లా జిల్లా లోని తంగళ్లపల్లి గ్రామంలో జన్మించారు.
రచనారంగం: జగన్నాథం ప్రధానంగా వచన కవిత్వం రాస్తారు. కథల సంకలనం కూడా వచ్చింది. వీరి కవిత్వంపై యం. నారాయణ శర్మ విశ్లేషణ చేసి ఊరి దుఃఖంపేరుతో ఒక వ్యాసాల పుస్తకాన్ని ప్రచురించారు. అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, మైనార్టీ వాదాల కవిత్వం రాశారు. ప్రధానంగా ప్రపంచీకరణ పరిణామాలను మొదటగా తెలుగు సాహిత్యంలో రాసిన కవిగా గుర్తింపు పొందారు.
వచన కవిత్వ సంకలనాలు: పాతాళ గరిగె (1993), ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (1996), గంగడోలు (1998), వాస్కోడిగామా డాట్ కామ్ (2000), బొడ్డుతాడు (2002), ఒకరోజు పదిగాయాలు (అత్యాధునిక కావ్యం) 2004,తల్లికొంగు (2006),
పిడికెడు కలలు! దోసెడు కన్నీళ్లు! (2008),తారంగం (2009), రాజపత్రం (2011), చిలుక రహస్యం (2012), చెట్టును దాటుకుంటూ.... (2015),వస (2017), ఊరు ఒక నారుమడి (2018),సద్దిముల్లె (2020).
కథా సంకలనం:-
వైపణి (2004)
అవార్డులు:
వలస (కథ) ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి (1986)
సినారె కవితా పురస్కారం (1998)
నూతన పాటి గంగాధరం పురస్కారం (2000)
ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
గరికపాటి పురస్కారం (2004)
సృజనాత్మకత ప్రక్రియలకు తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి అవార్డు (2002)
రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారం (2008)
కవిత్వం విభాగంలో తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం (2011)
తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త పురస్కారం (2015)
తెలంగాణ సారస్వత పరిషత్తు సినారె పురస్కారం (2019)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్దుబిడ్డ
అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం (2024) అందుకోబోతున్న
జూకంటి జగన్నాథం కి శుభాకాంక్షలు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >