Posted on 2024-07-21 08:49:53
షాద్ నగర్ సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ఆధ్యాత్మిక సేవలో తరించాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రతి ఒక్కరూ సమాజంలో ఆధ్యాత్మిక సేవలతో తరించాలని తద్వారా పుణ్యం, పురుషార్ధం లభిస్తాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు. ఈ సందర్భంగా గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిరు పేద వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆధ్యాత్మిక చింతనతో కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలతో పాటు చీరల పంపిణీ నిరంతరం చేపడుతున్నారని ఎంతో గొప్ప విషయం అని అందరికీ స్ఫూర్తిగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ ప్రధాన కార్యదర్శి సమాధానం సుధాకర్ తదితరుల సేవలను ఎమ్మెల్యే శంకర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయ అధ్యక్షుడు విజయ్ కుమార్, లయన్ కమ్మదనం సుధాకర్, మాజీ కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు చెంది తిరుపతి రెడ్డి, మహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, శ్రీశైలం, సాయి వంశీ, మాజీస ఉప సర్పంచ్ సీతారాం, భగవాన్ దాస్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >