| Daily భారత్
Logo




ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

News

Posted on 2024-07-20 18:18:36

Share: Share


ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

డైలీ భారత్, జగిత్యాల: ప్రజల సౌకర్యార్ధం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ప్రారంభించారు, ఈ సందర్భంగా మున్సిపల్ పట్టణాలతో పాటు, అన్ని మండల కేంద్రాల లోని ఎం.పీ.డీ.ఓ. కార్యాలయాలలో ప్రజా పాలన సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. 

వివిధ పనుల నిమిత్తం, సమస్యలు విన్నవిస్తూ అర్జీలు సమర్పించేందుకు అనునిత్యం ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్)కు వచ్చే వారికి సైతం ప్రజాపాలన సేవా కేంద్రం అందుబాటులో ఉండాలని భావించి దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల లోని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పలు కారణాల వల్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందలేక పోతున్న అర్హులైన దరఖాస్తుదారులు, ప్రజాపాలన సేవా కేంద్రాలను సందర్శించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేయించుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లోని సేవా కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డేటా సవరణ కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ వెంట రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్.పీ.జీ కస్టమర్ ఐడి, మొబైల్ నెంబర్ తమ వెంట తీసుకురావాలని సూచించారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, కలెక్టరేట్ ఏవో డిపిఓ వివిధ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >