| Daily భారత్
Logo




భార్యను కాపాడే యత్నంలో భర్త దుర్మరణం

News

Posted on 2024-07-13 17:56:32

Share: Share


భార్యను కాపాడే యత్నంలో  భర్త దుర్మరణం

విధి కాటుకు నవ జంట గిలగిల

భార్యను కాపాడే యత్నంలో  భర్త దుర్మరణం

నంద్యాల జిల్లా ఎర్రగుంటలో ప్రమాదం 

నాలుగు నెలల కిందటే ప్రేమ పెళ్లి 

అంతలోనే  ఘోర  విషాదం

డైలీ భారత్, నంద్యాల: కునికిపాటుతో రైలు  నుంచి పడిపోతున్న భార్యను కాపాడే ప్రయత్నంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సహచర ప్రయాణికులను కుదిపేసిన ఈ దుర్ఘటన నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియా భాను ప్రేమించుకున్నారు. నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. గుంటూరు నుంచి బెంగళూరకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య అసియాబాను ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణిస్తుండగా ఎర్రగుంట్ల వద్ద నిద్రమత్తులో అసియా భాను  రైలులో నుంచి కిందపడి పోయింది.  ఈ హఠాత్పరిణాయంతో ఆసిఫ్ ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకాడు.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ మహిళకు తీవ్ర గాయాలు కాగా రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు  కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >