Posted on 2024-07-08 16:25:10
డైలీ భారత్, తూప్రాన్ మెదక్ ప్రతినిధి:సంక్షేమంలో తనకు తానే సాటి అంటూ ప్రజలందరికీ అభివృద్ధి పలాలు అందించిన మరిచిపోలేని మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా నాయకులు బుడ్డ భాగ్యరాజ్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని తూప్రాన్ నర్సాపూర్ రోడ్ లో జై హనుమాన్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. సంక్షేమ సారధిగా ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఉచిత విద్యుత్ని ప్రవేశపెట్టడంతోపాటు ఒకే దఫా రుణమాఫీ చేయడమే కాకుండా సాగునీటి రంగాన్ని బలోపేతం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించారన్నారు. పేద విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ ప్రవేశ పెట్టి ఉన్నత విద్య కలను సాకారం చేశారన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజవర్గం సేవాదళ్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆర్.ఎం.పి & పీఎంపీ డాక్టర్స్అసోసియేషన్ అధ్యక్షులు అప్సర్ బాయ్,గరిగే నర్సింగరావు ,పన్నీరు రాము,దొంతి సోమయాదగిరి,కుమ్మరి రమేష్, ఆకుల కుమార్, గజానంద్ నాగరాజ్, బొలేపోయిన మహేష్ యాదవ్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >