Posted on 2024-06-14 19:52:25
డైలీ భారత్, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని వైద్య ఆరోగ్య విద్యాశాఖ అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. 20వ తేదీన ఏదైనా కారణాలతో మిగిలిపోయిన చిన్నారులకు 27వ తేదీన మాపప్ డే రోజున వేయించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి కళావతి భాయి మాట్లాడుతూ 1-19 పిల్లలకు మాత్రలు వేయబడుతుందని, ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరంలో పిల్లలకి సగం మాత్ర, రెండు నుంచి 19 సంవత్సరాలు పిల్లలందరికీ పూర్తి మాత్రగా డోస్ ఇవ్వబడుతుందని, ఇది నమిలి మింగాలని, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు మాత్రలను ఇంటికి తీసుకెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్. పి డిప్యూటీ సీఈఓ నర్మద, జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి కళావతి భాయి, డాక్టర్ అంబరీష్, డిప్యూటీ డిఎం హెచ్ ఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, జిల్లా వైద్య విద్యా సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Posted On 2026-03-06 20:09:42
Readmore >
TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ
Posted On 2026-03-06 20:04:50
Readmore >