| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేంద్ర మంత్రిగా బండి సంజయ్..!

కేంద్ర మంత్రిగా బండి సంజయ్..!

కిషన్ రెడ్డి , బండి సంజయ్ పేర్లు ఖరారు 

నేడు ప్రమాణ స్వీకారం

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు లభించనున్నాయి. తెలంగాణలో కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాదయాత్ర కూడా నిర్వహించారు.

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్ ను ఈసారి కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. తెలంగాణలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది పార్లమెంటు స్థానాలను బీజేపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Previous రహదారులతోనే ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఘోర ప్రమాదం..సాధువుల బృందంపై దూసుకుపోయిన డిసిఎం..ముగ్గురు మృతి
ADVERTISEMENT