ఓల్డ్ హైవే పనుల్లో తారు రోడ్డు పనులు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే రవాణా మార్గం మెరుగ్గా ఉండాలని అప్పుడే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. పట్టణంలో ఓల్డ్ హైవే రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఆదివారం బీటీ రోడ్డు తారు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం కాంట్రాక్టర్ వెంకట్ రెడ్డి, డిఈ రవీందర్, ఏఈ రాజశేఖర్ తదితరులను అభినందిస్తూ సీట్లు తినిపించారు. రోడ్డు నిర్మాణం పనులు అత్యంత నాణ్యతగా వేయాలని ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ..
రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా షాద్ నగర్ చౌరస్తా నుండి 4.9 కిలోమీటర్ల మేర అన్నారం జంక్షన్ వరకు నిర్మిస్తున్న ఈ రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం 45 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో కొత్తూరు ప్రాంతంలో ఒక అర కిలోమీటర్ వరకు నిధులు కేటాయించబడ్డాయని ఈ సందర్భంగా వివరించారు. వీలైనంత త్వరగా రోడ్డు పనులు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, జడ్పిటిసి వెంకటరామిరెడ్డి,బాలరాజ్ గౌడ్, తిరుపతి రెడ్డి, కృష్ణవేణి, జమృత్ ఖాన్, రాజేందర్ రెడ్డి, రాయికల్ శ్రీనివాస్, యాదగిరి యాదవ్, కౌన్సిలర్ సర్వర్ పాషా, సోలిపూర్ శ్రీశైలం, పెంటయ్య ,విజయ్ కుమార్, అప్పి, నల్లమోని శ్రీధర్, కొప్పునూరు ప్రవీణ్, నరేష్, లింగారెడ్డి గూడా అశోక్, సురేష్, అజ్మత్ బాబా తదితరులు పాల్గొన్నారు..