| Daily భారత్
Logo




శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో సి ఎస్ శాంతి కుమారి

News

Posted on 2024-05-28 10:54:31

Share: Share


శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో సి ఎస్ శాంతి కుమారి

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది వేడుక లకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2న ఉత్స వాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనను న్నారు. గన్‌పార్క్‌ అమర వీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించి, పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ గీతాన్ని ఆవిష్కరిస్తారు.

కాగా, ఈ వేడుకల నేప థ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరేడ్ గ్రౌండ్‌లో రిహార్సల్స్‌ను వీక్షించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సీఎస్ శాంతికు మారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ రవిగుప్తా తో పాటు సీఎస్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోలీసు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలను సన్మానించనున్నారు.

వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ గ్రౌండ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా కళ్లు చెదిరే పోలీసు కవాతు కోసం భద్రతా బలగాలు వారాల తరబడి రిహార్సల్స్ చేస్తున్నాయి. 

ఇందులో విద్యార్థులతో పాటు ఆక్టోపస్ బలగాలు, టీఎస్‌ఎస్పీ బెటాలియన్, ఏఆర్, కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులు పాల్గొంటు న్నారు.

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >