| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధి హామీ పథకం లోని కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగాలి : డి.ఆర్.డి.ఏ. అధికారి శ్రీనివాసరావు

ఉపాధి హామీ పథకం లోని కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగాలి : డి.ఆర్.డి.ఏ. అధికారి శ్రీనివాసరావు

డైలీ భారత్, మెదక్: స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం గ్రామీణాభివృద్ధి అధికారి, డి.ఆర్.డి.ఏ. అధికారి శ్రీనివాసరావు ఉపాధి హామీ పథకం అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఆర్ డి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పురోగతి పై అనగా, కూలీలకు ఉపాధి పనులపై అవగాహన కల్పించి, ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకొనుట, కూలీలకు సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకొనుట, కూలీలకు పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు (త్రాగు నీరు, షేడ్ నెట్, ORS ప్యాకెట్ల పంపిణీ, మొదలగు) కల్పించుట, పనులలో నాణ్యత, నర్సరీ ఎస్టిమేషన్స్, అమృత్ సరోవర్ పనులు మొదలగు అంశాలపై మెదక్ జిల్లా సమస్త అదనపు కార్యక్రమ అధికారులతో మరియు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు  తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Previous ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటాయి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Next సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించిన మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT