| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటాయి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటాయి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

డైలీ భారత్, మెదక్: కల్చారం మండలం లోని వరిగుంతం లో  ఏర్పాటు చేసిన సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించి ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 

వారిగుంతం  కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉన్నందున త్వరితగతిన కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేసి మిల్లుకు ధాన్యం తరలించాలని నిర్వహకులను ఆదేశించారు.గత ఖరీఫ్ లో 2023-24 సీజన్లో 16,994.80 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 389 రైతులకు 3.74 కోట్లు చెల్లించడం జరిగిందని,ఈ యాసంగి 2023 24 లో ఇప్పటివరకు 380 మంది రైతుల నుండి 17,158 గంటల దాన్యం కొనుగోలు చేశారని , ఇంకా సుమారుగా 4000 కింటల ధాన్యమును కొనుగోలు చేసి ఒక వారంలో ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తిచేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రస్తుతము వరి ధాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుచున్నవని గత యాసంగి సీజన్లో జిల్లాలో ఈరోజు నాటికి 1,34,5,66 టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం కొనుగోలు కేంద్రాల్లో సుమారు ధాన్యం కొనుగోలు పూర్తికాలేదు కానీ ప్రస్తుతం జిల్లాలో మొత్తం 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2,27,707.800 లా మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 52,575 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి రూ 367.23 కోట్లు చెల్లించడం జరిగింది.123 కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు పూర్తయింది అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని సబ్జెక్టు వ్యక్తం చేశారు జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా ప్రతిఘటన కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని 34 బాయిల్డ్ బిల్లులు 31 రా మిల్లులకు ధాన్యం కేటాయించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు మన జిల్లా నుండి సిద్దిపేట జిల్లాకు 10,000 ల మెట్రిక్ టన్నుల, మహబూబ్నగర్ జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని పంపించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా 600కు పైగా లారీలు అందుబాటులో ఉన్నామన్నారు. ఇవి కాకుండా అగరముగా 150 లారీల వరకు తెప్పించడం జరుగుతుందన్నారు. తద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. పండించిన ప్రతి దాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అకాల వర్షాలకు రైతులు కంగారు పడొద్దని ప్రతి రైతు పండించిన ప్రతి దాన్యం చివరి గింజలను కొనుగోలు పూర్తి చేస్తామని ,ప్రతి సెంటర్  ధాన్యం చివరి గింజ కొనే వరకు కొనుగోలు చేసే వరకు పనిచేస్తుందని తెలిపారు.


కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు , సంబంధిత ధాన్యం కొలుగోలు కేంద్రాల నిర్వహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలి-- జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
Next ఉపాధి హామీ పథకం లోని కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగాలి : డి.ఆర్.డి.ఏ. అధికారి శ్రీనివాసరావు
ADVERTISEMENT