డైలీ భారత్ ,రంగారెడ్డి జిల్లా : భూకబ్జా కేసులో కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఆదిభట్ల పరిధిలో ఉన్న రెండు ఎకరాల భూమిని కన్నారావు, అతడి అనుచరులు కబ్జాకు పాల్పడ్డారు. ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపడుతుండగా.. రెండు ఎకరాల భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అదేవిధంగా ప్రాజెక్ట్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు కన్నారావు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భూ కబ్జా కేసులో కన్నారావుతో పాటు మొత్తం 38 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు.
News
భూకబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావును అరెస్ట్