| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

డైలీ భారత్, నర్సాపూర్: ఏసీబీ వలకు నర్సాపూర్ పట్టణ వ్యవసాయ అధికారి గురువారం చిక్కాడు. బాదితుడు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర క్యాంప్ గ్రామానికి చెందిన వంగ నరేన్ ఎంఎస్ శివశక్తి ట్రేడ్ లైసెన్స్ నర్సాపూర్ పేరుతో ఫార్వార్డ్ చేయడం కోసం నర్సాపూర్ మండల వ్యవసాయాధికారి అనిల్ కుమార్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయాధికారి అనిల్ కుమార్ రూ.30వేలు లంచం ఇవ్యాలని డిమాండ్ చేశాడు.

దీంతో విసుగు చెందిన బాదితుడు వంగ నరేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నర్సాపూర్ వ్యవసాయ కార్యాలయంలో బాదితుని నుంచి లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ మెదక్ రేంజ్ కె.సుధార్శన్, ఇన్పెక్టర్లు వెంకట రాజాగౌడ్, రమేష్ లు పట్టుకున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఏసీబీ డిఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం ఏవో అనిల్ కుమార్ హైదరాబాద్ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారుల అదుపులో ఉన్నట్లు తెలిపారు.

Previous ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Next పిడుగుపాటుకు గురై ఒకరు మృతి
ADVERTISEMENT