| Daily భారత్
Logo


పెళ్లి పేరుతో భార్యాభర్తల మోసాలు

News

Posted on 2024-03-14 17:42:32

Share: Share


పెళ్లి పేరుతో భార్యాభర్తల మోసాలు

డైలీ భారత్, హైదరాబాద్: పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్‌ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు (భార్యాభర్తలను) హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సీసీఎస్‌ పోలీసులు వివరాల ప్రకారం యెలిగేటి రంజిత్‌ అలియాస్‌ యడ్ల శ్రీ రాధా కృష్ణ అలియాస్‌ రాకేష్, యెలిగేటి సంధ్య వీరిద్దరూ భార్యభర్తలు. వీరు సిరిసిల్ల జిల్లా వెంకంపేటకు చెందిన వారు. నగరంలోని పీర్జాదిగూడ వినాయక్‌ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. 

వీరు ఆన్‌లైన్‌లోని మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లలో ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్‌ ద్వారా వారి వివరాలను సేకరిస్తారు. ఆ వివరాల ఆధారంగా అమ్మాయిలను టార్గెట్‌ చేసి, నిందితుడు యెలిగేటి రంజిత్‌ తన పేరు యడ్ల శ్రీ రాధా కృష్ణగా నకిలీ పేరుతో పరిచయం చేసుకుంటాడు. తాను ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తినని రియల్‌ వ్యాపారాలు ఉన్నాయని నమ్మిస్తాడు. మాట్రిమోనీ సైట్లలో పరిచయమైన అమ్మాయిలతో పరిచయం చేసుకొని వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వారితో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకుంటాడు. తన భార్య యెలిగేటి సంధ్యను తన మేనేజర్‌గా వారికి పరిచయం చేస్తాడు.

అనంతరం అమ్మాయిల పేరెంట్స్‌తో సైతం వారి ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి నమ్మించేవాడు.బాగా పరిచయం అయ్యాక వారిని పెళ్లి చేసుకుంటానని వారిని ఒప్పించేవాడు. 

అనంతరం తనకు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో అత్యవసరంగా డబ్బు అవసరం ఉందంటూ లక్షల రూపాయలు తీసుకునే వాడు. మరో కేసులో బాధితుల నుంచి కట్నం,పెళ్లి గిఫ్ట్‌ల పేరుతో లక్షల రూపాయలు దండుకున్నాడు. గతంలో బాధితలు పిర్యాదు పై కేసు నమోదు చేసుకుని, సీసీఎస్‌ స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ టీమ్‌ ఇన్స్పెక్టర్ డి.బిక్షపతి ఆధ్వర్యంలో బృందం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విధంగా నిందితులు భార్యభర్తలు కలిసి 12 మంది బాధితుల నుంచి సుమారు రూ.30 లక్షలకు పైగా మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఓ సాంట్రో కారు,ద్విచక్ర వాహనం పోలీసులు సీజ్‌ చేశారు.

Image 1

విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట

Posted On 2024-05-16 22:34:57

Readmore >
Image 1

వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

Posted On 2024-05-16 22:30:45

Readmore >
Image 1

డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి

Posted On 2024-05-16 21:46:48

Readmore >
Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >