డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్లలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 18 మందికి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభ పురస్కారాలను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ మాట్లాడుతు...
పద్మశాలి సామాజిక వర్గం నుండి ఎంతో మంది వివిధ రంగాలలో ఉన్నతంగా ఎదిగారని అన్నారు.
నల్ల పరందాములు అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి అద్భుత ప్రతిభను చాటాడని తెలిపారు. దాని వారసత్వంగా తీసుకొని నల్ల విజయ్ మరియు ఎల్డి హరిప్రసాద్ చేనేతలో తన ప్రతిభ ఖండాంతరాలు దాటించాడని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు పడే శ్రమను గుర్తించి పవర్ లూమ్ పరిశ్రమలో ఫోల్డింగ్ యంత్రాన్ని జక్కని హేమంత్ రూపొందించడం ఉత్తమ ప్రతిభకు నిదర్శనం అని అన్నారు.
పోపా తన వంతు ప్రయత్నంగా యువతలో స్ఫూర్తి నింపేందుకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
ప్రతిభా పురస్కారాలలో భాగంగా ఆవార్డీలను మేమెంటో, శాలువా, సర్టిఫికేట్ లతో సత్కరించారు.
గాజుల ప్రతాప్ మాట్లాడుతూ అనేక మంది పద్మశాలి సామాజిక వర్గం నుండి ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, టి.జీ.టి, పి. జి. టి, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించి ప్రతిభను చాటారని అన్నారు.
ఒకటికి మించిన ఉద్యోగాలు సాధించడం అభినందనీయం అన్నారు.
MEO దూస రఘుపతి మాట్లాడుతూ పద్మశాలీ సామాజిక వర్గంలో నిరుపేదలైన ప్రతిభావంతులైన విద్యార్థులు, యువతకు నిరంతరం తోడుగా నిలుస్తామని పలువురు వక్తలు అన్నాడు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పద్మశాలీయులు తమ ప్రతిభా పాటవాలను చాటుతున్న విషయాన్ని గుర్తు చేసారు.
పోపా పూర్వ అధ్యక్షులు కల్లేపల్లి అశోక్ మాట్లాడుతు మూడు దశాబ్దాలుగా పోపా తన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు.
పోపా ఉపాధ్యక్షులు జీ. భుమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. జిల్లాలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు దూరం అవుతున్న విద్యార్థుల సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే వారికి ఆర్ధిక తోడ్పాటును అందించి చదివిస్తామన్నారు.
వాసాల హరిప్రసాద్ మాట్లాడుతూ దూస శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య, వైద్యం వంటి సేవలను కొనసాగిస్తూనే వివిధ రంగాల్లో రాణిస్తున్న పద్మశాలి వ్యక్తుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడంలో పోపా ముందు ఉంటుందన్నారు.
అనంతరం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన టీఎస్పీఎస్సీ, గురుకుల టీచర్లు, కాని స్టేబుళ్ల ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి టీజీటీ, పీజీటి లెక్చరర్ గా ఉద్యోగాలు సాధించిన పద్మశాలి యువతీ, యువకులను ఘనంగా సత్కరించారు. శాలువా, ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందజేశారు.
ప్రతిభా పురస్కార విజేతలు
పోపా ఆధ్వర్యంలో ఆదివారం అందజేసిన ప్రతిభా పురస్కారాలను అందుకున్నది వీరే.. పద్మనగరకు చెందిన కొలిపాక కృష్ణ, చౌకి శ్రీకాంత్, బొల్లి బాను ప్రకాశ్, మార్కండేయ నగర్కు చెందిన కోడం పూర్ణిమ, సాయినగర్ కు చెందిన అల్లే చంద్రశేఖర్, శాంతినగర్ కు చెందిన బైరి పుష్పలత, విద్యానగర్కు చెందిన వల్లాల మంజుల, బి.వై.నగర్ కు చెందిన ఆర్ కైలాసం, హనుమాజీపేటకు చెందిన కోడం నారాయణ, గాంధీనగర్కు చెందిన సామల శ్వేత, నెహ్రునగర్కు చెందిన అన్నల్బాస్ శ్రీనివాస్, క్లాత్ ఫోల్డింగ్ యంత్రాన్ని రూపొందించిన జక్కని హేమంత్, చేనేత రంగంలో సృజనాత్మక కళాకారులు వెల్లి హరిప్రసాద్, నల్ల విజయ్, డాక్టరేట్లు సాధించిన అడెపు ప్రియాంక, ఎలగొండ ఆంజనేయులు తదితరులను సత్కరించారు.
ఈకార్యక్రమంలో పోపా ఉపాధ్యక్షుడు జీ. భూమేష్, దూస రఘుపతి, పోపా పూర్వ అధ్యక్షుడు కల్లేపల్లి అశోక్, గాజుల ప్రతాప్,దూ స శ్రీనివాస్, వాసాల హరిప్రసాద్, బొల్లి భగవాన్, గడ్డం సత్యం, కొడం రాంప్రసాద్, కొక్కుల శ్రీనివాస్, రాపెల్లి సంతోష్, ఆడేపు చక్రపాణి, శివప్రసాద్, ఏలగొండ అంజనేయులు, ఆడేపు వేణు తదితరులు పాల్గొన్నారు.