| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి.. మహిళా కమిషన్ సీరియస్

ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి.. మహిళా కమిషన్ సీరియస్

డైలీ భారత్ అన్నమయ్య జిల్లా:అన్నమయ్య జిల్లా, ప్రభ న్యూస్ : ఆస్తుల పంపకం వృద్ధ తల్లిదండ్రులకు శాపంగా మారింది. కన్నకొడుకే కాలయముడిలా మారాడు. నవమాసాలు మోసీ, కనీ పెంచిన తల్లిదండ్రులపైనే అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు.

వృద్ధ దంపతుల్ని నోటికొ చ్చినట్లు అసభ్యకరమైన బూతులు తిడుతూ ఇష్టానుసారంగా చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ.. కాళ్లతో ఎగిరెగిరి తన్నిన ఓ కొడుకు ఉన్మాదంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో ప్రధానంగా వైరల్‌ అయ్యి మహిళా కమిషన్‌ దృష్టికొచ్చింది.

తక్షణమే స్పందించిన మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జల లక్ష్మి జిల్లా పోలీసు ఉన్నతా ధికారులతో మాట్లాడారు.

అనంతరం మదనపల్లె టౌన్‌ సీఐ యువరాజ్‌తోనూ మాట్లాడి.. వృద్ధ తల్లిదండ్రుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనపై సీరియస్‌గా స్పందించాల న్నారు. సభ్యసమాజం తలదించుకునేలా క్రూరంగా దాడిచేసిన వైనంపై వీడియో వైరల్‌ కావడాన్ని చర్చించారు...

Previous పోపా ప్రతిభ పురస్కారాలు ప్రదానం
Next తెలంగాణ రాష్ట్రంలో త్వరలో తెల్ల కల్లు బార్లు
ADVERTISEMENT