Posted on 2024-02-28 05:32:34
మామిడి వెంకటేష్ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు
తూప్రాన్ లో కులాల మధ్య చిచ్చు పెట్టింది చైర్మనే
నోటీసులు సంస్కృతి చైర్మన్ తోనే ప్రారంభం
డైలీ భారత్, తూప్రాన్:తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అవినీతి, అరాచకాల కు విసిగి వేసారి మాజీ మంత్రి హరీష్ రావు వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పలితం లేకపోవడంతో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామనీ బి.అర్.ఎస్.నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ కౌన్సిలర్ లు జిన్నా భగవాన్ రెడ్డి, మామిండ్ల కృష్ణ, రామునిగారి శ్రీశైలం గౌడ్, జమాల్పూర్ నర్సోజి , నారాయణ గుప్తా లు పేర్కొన్నారు. మంగళవారం క్యాంప్ నుంచి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతు సోమవారం తూప్రాన్ లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ లు దలితుని పై దాడి, నోటీస్ ఇచ్చారని ఆరోపించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సమయం ఇస్తే తూప్రాన్ లోని పాత మున్సిపల్ ఆఫీస్ ముందు బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. మామిడి వెంకటేష్ స్వచ్ఛందంగా వచ్చి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పై సంతకం చేసి మున్సిపల్ కమిషనర్ కు వివరించారని, అతన్ని తిరిగి చైర్మన్ యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. నోటీస్ లు ఇచ్చే విష సంస్కృతి చైర్మన్ తోనే ప్రారంభం అయింది అని అన్నారు. డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వక పోతే తూప్రాన్ లో బాధే జయ్ కి, గబ్బుల సిద్ధిరాములు కు, రఘుపతి కి నోటీసు లు ఇచ్చి తన సొంత జవాన్ లను మున్సిపల్ ను నుంచి జీతం ఇప్పించి మామ్ముల్లు మరి ముక్కు పిండి దౌర్జన్యంగా వసూల్ చేయించాడని ఆరోపించారు. తూప్రాన్ మున్సిపల్ బి.అర్.ఎస్ ప్రెసిడెంట్ సరాఫ సతీష్ చారి, ఉద్యమకారుడు సీనియర్ నేత మన్నే శ్రీనివాస్ రావు లాంటి చాలా మంది సీనియర్ నాయకులను కాదని మెదక్, గజ్వేల్, నుంచి వచ్చిన ప్రతినిదులు కేవలం మున్సిపల్ చైర్మన్ చెప్పిన అబద్ధపు మాటలు విని వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు జండా దగ్గర లేదా పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి తే నిజా నిజాలు బయటకు వస్తాయన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్న గారు బి.అర్.ఎస్ ఓదార్పు యాత్ర చేపట్టి లాభం లేదని అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి లాభం, చేసుకున్నోల్లకు చేసుకున్నంత ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని, తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు చైర్మన్ వైఖరిని ఎండగట్టారు., తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఇప్పటికైనా పక్కకు వైదొలగాలని హితవు పలికారు. ఎవరొచ్చినా ఏమిచేస్తారు ఓదార్పు తప్ప మున్సిపల్ పాలక వర్గం గడిచిన నాలుగేళ్ల కాలం ధన దాహంతో ఒంటెద్దు పోకడతో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ లో బి.అర్.ఎస్ ను రెండు వర్గాలుగా విభజించారు అని అన్నారు. మనస్పర్థలు పెరిగి ముదిరి పాకాన పడింది చైర్మన్ తోనే అయ్యిందని అన్నారు. అసమ్మతి సెగ తో బి.అర్.ఎస్ కు మెజార్టీ సభ్యులు ఉన్నప్పటికీ చైర్మన్ వైఖరి పట్ల విసిగి వేసారి ఏకంగా తొమ్మిది మంది కౌన్సిలర్ లు బి.అర్.ఎస్ పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరామన్నారు. దీనితో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన పిదప క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అయినా చైర్మన్ లో మార్పు రాకపోవడం వినాశ కాలే విపరీత బుద్ధి కుశలత కలిగి మామిడి వెంకటేష్ ను తన వైపు తిప్పుకుని రాజకీయం చేస్తున్నాడని ఆయన ఎత్తులు జిత్తు చేసి గద్దె దించడానికి అందరం కంకణ బద్దులమై ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తూప్రాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్, మామిండ్ల జ్యోతి కృష్ణ, కొడిప్యక నారాయణ గుప్తా, భగవాన్ రెడ్డి, పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా, జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజీ, ప్రియాంక తండ్రి రఘుపతి, రాజు, కౌన్సిలర్లూ తదితరులు ఉన్నారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >