| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాద‌య్య యాదిలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాద‌య్య యాదిలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఉద్యమకారుల శవాలపై అధికారాన్ని ఏలిన బిఆర్ఎస్ పార్టీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ ఉద్యమ కారుడు సిరిపురం యాదయ్యను మరిచిన తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. ఉద్యమ పార్టి అని గొప్పలు చెప్పుకునే విలువ లేని పార్టీ ఉద్యమకారుల శవాలపై అధికారాన్ని ఏలిన పార్టీ నేడు ఉద్యమకారుల వర్ధంతి కూడా మరచిన పార్టీకి తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే శంకర్ విరుచుకుపడ్డారు. కేశంపేట మండల కేంద్రంలో సిరిపురం యాదయ్య వర్ధంతిని నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ అభివృద్ధి కొసం పాటుపడే  ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మి  అధికారాన్ని కట్టబెట్టిన పార్టీకి అన్ని విధాలుగా సహకారాల అందిస్తామని తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అమరవీరులను ఎల్లవేళలా కాపాడుకుంటామని తెలంగాణ ఉద్యమా అమరవీరులను యాధి మరువమని సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ నివాళులర్పించడం జరిగింది.

కొవ్వొత్తి త‌ను కాలుతు లోకానికి వెలుగులు పంచిన‌ట్టు కాగ‌డాలా మండి తెలంగాణ కాంక్ష‌ను చాటిన త్యాగ‌ధ‌నుడు సిరిపురం యాద‌య్య అని యాద‌య్య భౌతికంగా లేకపోవ‌చ్చు..కాని యాద‌య్య ఆశ‌యం అమ‌రం

అమ‌ర‌వీరుడు యాద‌య్య యాదిలో తెలంగాణ ఆశ‌ల‌ను ఆకాంక్ష‌ల‌ను నేర‌వేర్చుకుందాం


యాద‌య్య...నిన్ను యాది మ‌రువ‌మ‌య్యా! నీ వ‌ర్దంతి రోజునా ఇదే తెలంగాణ‌ వాగ్ధానం అంటూ పలువురు గొంతెత్తి చాటారు. ఈ కార్యక్రమంలో కేశంపేట జడ్పిటిసి విశాలాశ్రవణ్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు వీరేశం, సీనియర్ నాయకుడు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Previous సిరిసిల్ల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై ప్రజావాణిలో పిర్యాదు బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్
Next తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన మన షాద్ నగర్ నియోజకవర్గం : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు
ADVERTISEMENT