| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రైవేట్ బస్సు,రెండు లారీలు ఢీ: పెరుగుతున్న మృతుల సంఖ్య

ప్రైవేట్ బస్సు,రెండు లారీలు ఢీ: పెరుగుతున్న మృతుల సంఖ్య

డైలీ భారత్, నెల్లూరు జిల్లా:కావలిలో టోల్‌ప్లాజా వద్ద రెండు లారీలు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్రగాయాలయ్యాయి..

గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ క చర్యలు చేపట్టారు.

గాయపడిన బాధితులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇంకా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

Previous తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా ట్రాన్స్ జెండర్ సింధు
Next ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్
ADVERTISEMENT