నషా ముక్త్ భారత్ పాదయాత్రకు సన్నాహాలు! కావాడిగుడాలో కీలక సమావేశం!
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ కావాడిగుడలోని సీజీఓ టవర్స్ లో నషా ముక్త్ భారత్ పాదయాత్ర సన్నాహక సమావేశం జరిగింది!
పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు బంగారు శృతి ఆధ్వర్యంలో నాన్ తెలుగు కమ్యూనిటీస్ ప్రతినిధులతో ఈ కీలక సమావేశం నిర్వహించారు!
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు!
ఈ సమావేశంలో బీజేపీ స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ మరియు నాన్ తెలుగు కమ్యూనిటీస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు!
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని గుజరాతి, మరాఠి, సిక్, మార్వాడి వంటి పలు నాన్ తెలుగు కమ్యూనిటీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు!
ఈనెల 22న కమ్యూనిటీస్ వారీగా కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు!
#DailyBharath #Hyderabad #NashaMuktBharat #KishanReddy #DrugsFreeSociety